అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)
రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయన్న సీఎం.. అమరావతి కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు కేంద్రంగా ఉంటుందని వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని ప్రతినిధులు చెప్పారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రతినిధులతోనూ సీఎం భేటీ అయ్యారు. భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏడీఎన్‌ఓసీ ఆసక్తి చూపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. పెట్రో కెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని వివరించారు. అబుదాబీలోని పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి బృందం నెట్‌వర్క్ లంచ్‌లో పాల్గొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ