శ్రీకాకుళం జిల్లాలు చెందిన యువకుడు అబుదాబీలో అనుమాస్పద మృతి
అమరావతి, 23 అక్టోబర్ (హి.స.) ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు అబుబాబిలో అనుమానాస్పద మృతిలో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి విజయ్ 7 నెలలు క్రితం అబుదాబిలోని ఎన్‌హెచ్‌ఎస్‌ కంపెన
శ్రీకాకుళం జిల్లాలు చెందిన యువకుడు అబుదాబీలో అనుమాస్పద మృతి


అమరావతి, 23 అక్టోబర్ (హి.స.)

ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు అబుబాబిలో అనుమానాస్పద మృతిలో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి విజయ్ 7 నెలలు క్రితం అబుదాబిలోని ఎన్‌హెచ్‌ఎస్‌ కంపెనీలో చేరాడు. బుధవారం ఉదయం 6 గంటలకు విజయ్‌ తమతో మాట్లాడాడని.. గురువారం ఉదయం విజయ్‌ మృతిచెందినట్లు అక్కడే ఉన్న తన పెద్దకుమారుడు బన్నీ ద్వారా విషయం తెలుసినట్లు విజయ్‌ తండ్రి శంకర్ తెలిపారు. కుమారుడి మరణవార్త విన్న ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమ కుమారుడు విజయ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బాధిత కుటంబం కోరుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande