సైబర్ మోసాలకు పాల్పడిన ఇద్దరు నేరగాళ్ల అరెస్ట్.. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ
ఆసిఫాబాద్, 27 అక్టోబర్ (హి.స.) సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మే 21న వాట్సాప్ లింక్ పంపించి ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుంచ
ఎస్పి ఆసిఫాబాద్


ఆసిఫాబాద్, 27 అక్టోబర్ (హి.స.) సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరు

వ్యక్తులను అరెస్టు చేసినట్లు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మే 21న వాట్సాప్ లింక్ పంపించి ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు 1లక్ష 66 వేలు కాజేశారు. అదే నెల 27న బాధితులు ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. అందులోని 60 వేల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

సదరు వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లావాదేవీ ద్వారా గుజరాత్ రాష్ట్రానికి చెందిన పంకజ్ భాయ్, శైలేష్ మకావన అనే ఇద్దరు సైబర్ నీరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మే 21 నుంచి మే 28 తేదీ వరకు వీరు పలువురి వద్ద నుంచి 3 లక్షల 47 రూపాయలు మోసం చేసినట్లు ఫోన్ యూపీఐ ఐడీ లావాదేవీల ద్వారా గుర్తించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన లింక్ లను క్లిక్ చేసి ప్రజలు మోసపోవద్దని. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande