బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు.. ఇది కండకావరమే!
అమరావతి, 27 అక్టోబర్ (హి.స.)బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తాజా చర్య భారతీయుల ఆగ్రహానికి గురి చేసింది. కొందరు ఇండియన్స్ ఈ చర్యను కండకావరమే అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ
బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు.. ఇది కండకావరమే!


అమరావతి, 27 అక్టోబర్ (హి.స.)బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తాజా చర్య భారతీయుల ఆగ్రహానికి గురి చేసింది. కొందరు ఇండియన్స్ ఈ చర్యను కండకావరమే అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ – పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు వివాదాస్పద మ్యాప్‌ను అందజేశారు. ఈ మ్యాప్‌లో భారతదేశంలోని అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించారు. అనంతరం ఆయన పాకిస్థాన్ జనరల్‌తో తన సమావేశానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మొహమ్మద్ యూనస్ ఢాకా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను కలిశారు. ఈ సమయంలో యూనస్ పాక్ జనరల్‌కు “ది ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్” అనే పుస్తకాన్ని బహుకరించారు. దీని ముఖచిత్రంలో బంగ్లాదేశ్ వక్రీకరించిన మ్యాప్ ఉంది. ఈ మ్యాప్‌లో భారతదేశం ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంగా చిత్రీకరించి ఉన్నాయి. దీంతో కొత్త వివాదం తలెత్తింది. ఎందుకంటే ఈ చర్యలు గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ డిమాండ్లకు అనుగుణంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande