తుఫాన్.ప్రభావం పలు రైళ్లు.రద్దు
విశాఖపట్నం, అక్టోబర్ 27: 27 అక్టోబర్ (హి.స.) మొంథా తుపాన్ ) ఆంధ్రా వైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. మొంథా తుపా
తుఫాన్.ప్రభావం పలు రైళ్లు.రద్దు


విశాఖపట్నం, అక్టోబర్ 27: 27 అక్టోబర్ (హి.స.)

మొంథా తుపాన్ ) ఆంధ్రా వైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వేశాఖ అలర్ట్ అయ్యింది. తుపాన్ కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విశాఖ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, ఎల్టిటీతో పాటు పలు ప్రధాన రైళ్లు, పలు పాసింజర్ రైళ్లు ఉన్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విశాఖ మీదుగా సాగే రైల్వే సర్వీసులు రద్దు అయ్యాయి. క్యాన్సెల్ అయిన రైలు సర్వీసుల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది. తుపాన్ తీవ్రతను బట్టి రైల్వే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande