
నెల్లూరు: 27 అక్టోబర్ (హి.స.)
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొని వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. కర్నూలు బస్సు ప్రమాదంలో రమేశ్ కుటుంబం మరణించిన సంగతి తెలిసిందే. వీరి అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులు.. వింజమూరు మండలం గోళ్లవారి పల్లి నుంచి విజయవాడ వెళ్తున్నారు. జలదంకిలో వీరి కారు టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. (
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ