జూబ్లీహిల్స్ గెలుపు తో 2028లో బీజేపీ ప్రభుత్వానికి నాంది.. రామచంద్ర రావు
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ లో మజ్లిస్-బీజేపీ మధ్యే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సోమవారం సమీక్ష జరిగింది. జిల్లా నేతలకు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచార బా
రామచంద్ర రావు


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ లో మజ్లిస్-బీజేపీ మధ్యే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సోమవారం సమీక్ష జరిగింది. జిల్లా నేతలకు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశానికి రామచందర్రావు, కిషన్రెడ్డి హాజరై డివిజన్ ఇన్ఛార్జ్లు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా రామచందర్రావు మాట్లాడుతూ.. జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీకి ఓటు వేయకుంటే మజ్లిస్కు 8 సీట్లు అవుతాయన్నారు. హైదరాబాద్లో ఎంఐఎంను ఆపాలి అంటే బీజేపీని గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ విజయానికి అవకాశాలు పెరుగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపించాలని ప్రజలకు ఆలోచన వచ్చిందని తెలిపారు. 2028 జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ గెలుపు నాంది కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కానీ.. కాంగ్రెస్ కానీ చేసిందేమీ లేదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande