సీసీఐ కేంద్రాల్లో పత్తి కి మద్దతు ధర.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి, 27 అక్టోబర్ (హి.స.) సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మితే మద్దతు ధర లభిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ రోజు చిట్యాల మండలం శాంతినగర్ శివారులోని ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగో
భూపాలపల్లి ఎమ్మెల్యే


జయశంకర్ భూపాలపల్లి, 27 అక్టోబర్ (హి.స.)

సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మితే మద్దతు ధర లభిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ రోజు చిట్యాల మండలం శాంతినగర్ శివారులోని ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడ వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande