
వనపర్తి, 27 అక్టోబర్ (హి.స.)
పోలీసు అమరవీరుల త్యాగనిరతి
మదిలో పెట్టుకొని సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరం పాటుపడుదామని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా సోమవారం వనపర్తి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు పోలీసులు అధికారులు, సిబ్బంది నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఎస్పీ జండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజలు మంచి మనసున్న వారని, శాంతి భద్రతల విషయంలో సమన్వయం పాటిస్తూ జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు పోలీసు శాఖకు ప్రజల సహకారం ఎంతో గొప్పది అన్నారు.
పోలీసు అమరవీరుల మరణాలను స్మరించుకుంటూ పోలీసు శాఖ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటుగా జర్నలిస్టులు, యువకులు, నిస్వార్థ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు, మహిళలు సుమారు 250 యూనిట్ల రక్తం దానం చేయడం హర్షినీయం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు