రాహుల్ గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా నటిస్తున్నారు.. హరీశ్రావు ఫైర్
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.) లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శలు గుప్పించారు. రాహుల్గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారని వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైద
హరీష్ రావు


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శలు గుప్పించారు. రాహుల్గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారని వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు. ఎర్రగడ్డలో హరీశ్రావు ఆటో డ్రైవర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి పేరుకు ఉచిత బస్ అన్నారు. ఐదుసార్లు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపారు. రాహుల్ గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు. అశోక్ నగర్ వెళ్లి మెట్లపై కూర్చుని మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. రాహుల్ గాంధీ ఆటోలో యూసుఫ్ గూడ వెళ్లి ఆటో వాళ్లకి ఇచ్చిన హామీలను విస్మరించారు. రాష్ట్రంలో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి. రాహుల్ గాంధీ మళ్లీ హైదరాబాద్కు రారా? శంషాబాద్ ఎయిర్పోర్టులో రాహుల్ గాంధీకి అడ్డంగా పెట్టి ఆటో కార్మికులు అడ్డుకుంటారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. మంత్రులు వాటాలు పంచుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ.. ఆటో కార్మికులకు ఇవ్వడానికి ఉండవా?, రూ.3 వేల కోట్ల రూపాయల ఆదాయం మద్యంపై వచ్చింది.. అవి ఆటో కార్మికులకు ఇవ్వండి.” అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande