
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ కేబినెట్ భేటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల కోసం తిట్టుకోవడం, తన్నుకుంటున్నారని, రాష్ట్ర కేబినెట్ దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఓ న్యూస్ చానల్తో మాట్లాడిన పొన్నం.. కేబినెట్పై హరీశ్ రావు చేసిన ఆరోపణలు అవాస్తవం అని హరీశ్ రావు డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయాలన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్ రావుకు లేదని ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదన్నారు. జూబ్లీహిల్స్ లోనూ కంటోన్మెంట్ ఫలితాలే రిపీట్ కాబోతున్నాయని జోస్యం చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు