ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, 27 అక్టోబర్ (హి.స.) ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కనగల్ మండలం పగిడిమర్రిలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశ
నల్గొండ కలెక్టర్


నల్గొండ, 27 అక్టోబర్ (హి.స.)

ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కనగల్ మండలం పగిడిమర్రిలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడవడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీఎం, సెంటర్ ఇన్చార్జిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధాన్యం సేకరణలో ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. పగిడిమర్రిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం సరైన స్థలంలో లేనందున తక్షణమే ఇతర ప్రదేశానికి మార్చాలని, ఇందుకుగాను అనువైన ప్రభుత్వ స్థలాన్ని చూడాలని తాసీల్దార్ పద్మను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande