నిజామాబాద్ లో నార్కోటిక్ బృందం దాడులు.. కల్తీ కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థం స్వాధీనం
నిజామాబాద్, 27 అక్టోబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించిoది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత
నార్కోటిక్ బృందం


నిజామాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించిoది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ తో పాటు మోపాల్ మండల పరిధిలో దాడులు నిర్వహించారు.

వినాయక నగర్ ప్రాంతంలో నివాసం ఉండే ప్రవీణ్ గౌడ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై మోపాల్ లో గల తమ కల్లు డిపో కు వెళ్తుండగా మార్గమధ్యంలో నార్కోటిక్ బృందం అతన్ని పట్టుకొని తనిఖీ చేశారు. అతడి సమాచారం మేరకు వినాయక నగర్ ప్రాంతంలో ఉండే సాగర్ గౌడ్ అనే మరో వ్యక్తి ఇంట్లో సైతం నార్కోటిక్ టీం తనిఖీలు నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande