ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య : కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, 11 నవంబర్ (హి.స.) ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి జిల్లా పరిషత్ బాల
కలెక్టర్ హనుమంతరావు


యాదాద్రి భువనగిరి, 11 నవంబర్ (హి.స.) ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. రోజు ఈ విధంగానే భోజనం పెడుతున్నారా, పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో విద్యార్థుల గణిత సామర్ధ్యాన్ని ఆయన పరిక్షించారు. ఈ విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్తత సాధించాలని, ఎక్కువ మార్కులు వచ్చిన 250 మంది విద్యార్థులకు సైకిల్ అందజేస్తామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande