నష్టాల నుంచి లాభాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే.
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{} ముంబై,, 19, నవంబర్ (హ
Bombay Stock Exchange


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ముంబై,, 19, నవంబర్ (హి.స.)మంగళవారం నష్టాలను మూటగట్టుకున్న దేశీయ సూచీలు బుధవారం ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే లాభాల్లోకి ప్రవేశించి దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఐటీ రంగంపై సానుకూల వార్తలు సూచీలను నడిపిస్తున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం లభాల్లో కదలాడుతున్నాయి.

త సెషన్ ముగింపు (84, 673)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కిందకు దిగజారింది. దాదాపు 150 పాయింట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత అనుహ్యంగా పుంజుకుని లాభాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 247 పాయింట్ల లాభంతో 84, 920 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 53 పాయింట్ల లాభంతో 25, 963 వద్ద కొనసాగుతోంది (stock market news today).

సెన్సెక్స్‌లో పెర్సిస్టెంట్, మదర్సన్, సోనా బీఎల్‌డబ్ల్యూ, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). బయోకాన్, లారస్ ల్యాబ్స్, ఎన్‌బీసీసీ, కమిన్స్, పిరామిల్ ఫార్మా మొదలైన షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 29 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.43గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande