ఐసిస్తో సంబంధాలు.. ఇద్దరు మైనర్లు అరెస్ట్ : చతిస్గడ్ డిప్యూటీ సీఎం
చతిస్గడ్, 19 నవంబర్ (హి.స.) ఢిల్లీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడితో యావతో దేశం ఉలిక్కిపడింది. దర్యాప్తులో.. ఉగ్రమూకలు పలు ప్రాంతాల్లో భారీగా బ్లాస్టింగ్స్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలియడంతో.. ముష్కరులను పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు గాలి
చతిస్గడ్ డిప్యూటీ సీఎం


చతిస్గడ్, 19 నవంబర్ (హి.స.)

ఢిల్లీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడితో

యావతో దేశం ఉలిక్కిపడింది. దర్యాప్తులో.. ఉగ్రమూకలు పలు ప్రాంతాల్లో భారీగా బ్లాస్టింగ్స్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలియడంతో.. ముష్కరులను పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ లో ఉగ్రవాద నిరోధక దళం ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుందని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. వీరిద్దరూ పాకిస్థాన్ కేంద్రంలో పనిచేస్తున్న ఐసిస్ హ్యాండ్లర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో నకిలీ ఐడీలతో ఉగ్రవాదం, విద్వేష భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇతర బాలురను కూడా ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్రయత్నాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న మైనర్లను గుర్తించడం ఇదే తొలిసారన్నారు. అలాంటివారు రాష్ట్రంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని బలగాలు గాలిస్తున్నాయని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande