ఆ క్రిస్టియన్ అధికారి తొలగింపు సబబే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, 25 నవంబర్ (హి.స.) మతపరమైన పరేడ్లో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ను విధులనుండి తొలగించడానికి సుప్రీం కోర్ట్ సమర్థించింది. ఇది సైనిక అధికారిగా అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణా రాహిత్యం అని దీని ద్వారా అతను ఎలాంటి
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 25 నవంబర్ (హి.స.)

మతపరమైన పరేడ్లో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ను విధులనుండి తొలగించడానికి సుప్రీం కోర్ట్ సమర్థించింది. ఇది సైనిక అధికారిగా అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణా రాహిత్యం అని దీని ద్వారా అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ అంశంలో ఆర్మీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సైన్యం ఒక లౌకికమైన సంస్థ అని అయితే క్రమశిక్షణలో రాజీపడలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిలతో (Justice Joymala Bagchi) కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.

శామ్యూల్ కమలేసన్ అనే క్రైస్తవ అధికారి తాను విధులు నిర్వర్తించే రెజిమెంట్లో గురుద్వారా, మందిరం ఉన్నాయి. విధుల్లో భాగంగా జవాన్లు ప్రతి వారం ఆ గుడిలోనికి వెళ్లి పూజలు చేసి మతపర పరేడ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ట్రూప్ లీడర్ గా శామ్యూలే తన కింద పని చేసే జవాన్లను గుడికి తీసుకుకెళ్లాల్సి ఉoటుంది. అయితే తాను క్రిస్టియన్ అయినందున అలాంటి పూజలు చేయలేనని, తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో 2021 మార్చి 3న ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande