
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
దిల్లీ: 25,నవంబర్ (హి.స.)
హింస, వేధింపులు లేదా ఏ రూపంలోనైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) 24 గంటలూ అందుబాటులో ఉండే కొత్త హెల్ప్‌లైన్ నంబర్-14490ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మహిళలు ఈ నంబర్‌ను సంప్రదించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకోవచ్చు. వీరికి హెల్ప్‌లైన్ సిబ్బంది సహాయం చేస్తారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించటానికి సాయపడతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ