
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}
.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}
కోల్‌కత్తా: , 25 నవంబర్ (హి.స.)
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}
.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}
.pf0{}
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల పనితీరులో తక్షణం జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. పోల్ డేటా ఎంట్రీ కోసం కాంట్రాక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బంగ్లా సహాయత కేంద్ర సిబ్బందిని నియమించవద్దంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాదు.. ప్రైవేట్ గృహ సముదాయాల్లో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించారు. ఈ చర్యలన్నీ ఒక రాజకీయ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం, ఆ పార్టీ ఆదేశం మేరకు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఇప్పటికే జిల్లా కార్యాలయాల్లోని సమర్థులైన నిపుణులు ఈ విధులు నిర్వహిస్తుండగా ఇతర సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌ం ఇవ్వడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాల్లోని ఫీల్డ్ ఆఫీసులు తమ అవసరానికి అనుగుణంగా సొంతంగా కాంట్రాక్టు డేటా ఎంట్రీ సిబ్బందిని నియమించుకుంటాయని, ఆ నియామకాలను చేపట్టే అధికారం జిల్లా ఎన్నికల అధికారులకుందని ఆమె తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ