మంటల్లో అపార్ట్‌మెంట్లు.. 44 మంది మృతి.. 279 మంది మిస్సింగ్.. ఘోర ప్రమాదం ఎలా జరిగిందంటే..?
హాంకాంగ్‌, 27 నవంబర్ (హి.స.)హాంకాంగ్‌లోని తైపో ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. వాంగ్ ఫక్ కోర్టు అనే నివాస సముదాయంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 44 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. . మరోవైపు, ఈ ఘటన జరిగినప్
Hong Kong Fire Accident: 44 Dead, 279 Missing in Tai Po Apartmen


హాంకాంగ్‌, 27 నవంబర్ (హి.స.)హాంకాంగ్‌లోని తైపో ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. వాంగ్ ఫక్ కోర్టు అనే నివాస సముదాయంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 44 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. . మరోవైపు, ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 279 మంది కనిపించడం లేదని అధికారులు ప్రకటించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వాంగ్‌ ఫుక్‌ కోర్ట్‌ కాంప్లెక్స్‌లో 8 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌లో 31 అంతస్తుల నిర్మాణం ఉంది. దాదాపు 2,000 అపార్ట్‌మెంట్లలో 4,800 మంది నివసిస్తున్నారు. మంటలు ఇంత వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణాలను అధికారులు గుర్తించారు. ఈ అపార్ట్‌మెంట్‌ల బయటి గోడల నిర్మాణం వెదురు బొంగుతో చేశారు. అదేవిధంగా కన్‌స్ట్రక్షన్‌ సమయంలో వాడిన నెట్ తొలగించలేదు. మంటలు వ్యాపించే సమయంలో భారీగా గాలులు వీయడం వల్ల అగ్నికీలలు ఇతర టవర్లకూ పాకి, అవి కూడా తగలబడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande