భీకర యుద్ధం: ఇరాన్ సంక్షోభం 1,300 మంది మృతి, లక్ష మంది నిరాశ్రయులు
న్యూఢిల్లీ, 08 మార్చి (హి.స.) ఇరాన్లో గత వారం రోజులుగా జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల (US-Israeli attacks) కారణంగా మానవీయ సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ భీకర పోరాటంలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కల
War


న్యూఢిల్లీ, 08 మార్చి (హి.స.)

ఇరాన్లో గత వారం రోజులుగా

జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల (US-Israeli attacks) కారణంగా మానవీయ సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ భీకర పోరాటంలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. యుద్ధ తీవ్రతకు భయపడి దాదాపు లక్ష మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం (UNHCR) సహాయం కోసం వస్తున్న విజ్ఞప్తులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్లోని సైనిక ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తూ ఇరాన్ సైనిక యంత్రాంగాన్ని దెబ్బతీస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై స్పందిస్తూ, తాము ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, క్షిపణి వ్యవస్థలను దాదాపు తుడిచిపెట్టామని ప్రకటించారు. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అంతం చేయడం ద్వారా ప్రపంచానికి పట్టిన పెద్ద 'క్యాన్సర్'ను వదిలించామని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్లోని ఒక పాఠశాలపై జరిగిన దాడికి అమెరికా కారణమన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇరాన్ తన క్షిపణులను సరిగ్గా గురిచూసి కాల్చలేకపోవడం వల్లే ఆ ఘోరం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాట్లాడుతూ.. ఇరాన్ తన మొండి వైఖరిని వీడితే చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రోజు రోజుకు పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న సుమారు 90 లక్షల మంది భారతీయుల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande