CEC జ్ఞానేష్ కుమార్ కు దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం చైర్ పర్సన్ ఫోన్
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.) బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం చైర్ పర్సన్ మోసోతో మాపియా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు ఈరోజు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 75 మిలియన్ల
జ్ఞానేష్ కుమార్


హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక

పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం చైర్ పర్సన్ మోసోతో మాపియా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు ఈరోజు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 75 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్న బీహార్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘానికి దక్షిణాఫ్రికా నుంచి ఈ ప్రత్యేక శుభాకాంక్షలు అందాయి.

ఈ సందర్భంగా మోప్యా.. జ్ఞానేష్ కుమార్తో మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహించే దేశాలలో భారత్ ముందు వరుసలో ఉంది. మీ ఎన్నికల ప్రక్రియ మాకు ఆదర్శం, అని పేర్కొన్నారు. అదనంగా, దక్షిణాఫ్రికా పార్లమెంటేరియన్లు త్వరలో భారతదేశాన్ని సందర్శించి, భారత ఎన్నికల వ్యవస్థ (ECI) పనితీరును ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. జ్ఞానేష్ కుమార్ ఈ కాల్ ను ఆత్మీయమైన- ప్రోత్సాహకరమైన సంకేతంగా అభివర్ణిస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రెండు దేశాలు మరింత సన్నిహితంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande