అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశాలు
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.) రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) ఏజెన్సీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్న
అనిల్ అంబానీ


హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) ఏజెన్సీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అయితే, రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసిన రెండు రోజుల్లో అనిల్ అంబానీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande