బీహార్ లో నారా లోకేష్.. ఎన్డీఏను గెలిపించాలని పిలుపు
పాట్నా, 9 నవంబర్ (హి.స.)ఎన్డీఏ కూటమికి మద్ధతుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్ధతుగా పాట్నాలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీహార్
బీహార్ లో నారా లోకేష్.. ఎన్డీఏను గెలిపించాలని పిలుపు


పాట్నా, 9 నవంబర్ (హి.స.)ఎన్డీఏ కూటమికి మద్ధతుగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులకు మద్ధతుగా పాట్నాలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీహార్ సర్వతోముఖాభివృద్ధి కోసం మరోసారి ఎన్టీఏను గెలిపించాలని బీహార్ యువతకు (Bihar Youth) పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగతున్న ఎన్నికలు భారత రాజకీయాల్లో ఎంతో కీలకమని పేర్కొన్నారు.

అవినీతిరహిత పాలన కోసంస్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం బీహార్ లో ఎన్డీఏని గెలిపించాలని మంత్రి అక్కడి ఓటర్లను కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్ రూపురేఖలు మార్చేశారని గుర్తు చేశారు. బీహార్ లో నాని (నరేంద్ర మోడీ జీ, నితీష్ కుమార్ జీ) నాయకత్వం ఉందన్నారు. ఏపీలో నరేంద్ర మోడీ (Narendra Modi), చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) నాయకత్వం ఉందని తెలిపారు. విజన్, సమర్థతతో వారివురూ పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర చాలా పెద్దదన్నారు. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ప్రధానమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande