
ఢిల్లీ 14,డిసెంబర్ (హి.స.)
ఆఫ్రికా దేశం లిబియా (Libya)లో భారతీయ కుటుంబం కిడ్నాప్‌నకు గురయ్యింది. బాధితులను విడిచిపెట్టేందుకు దుండగులు రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబం రాష్ట్రంలోని మెహసాణా జిల్లాకు చెందినవారుగా వెల్లడించారు
మెహసాణా సూపరింటెండెంట్ అధికారి హిమాన్షు సోలంకి కథనం ప్రకారం.. కిస్మత్‌సింగ్ చావ్డా, ఆయన భార్య హీనాబెన్, కూతురు దేవాన్షి కిడ్నాప్‌నకు గురయ్యారు. పోర్చుగల్‌లో స్థిరపడ్డ కిస్మత్ సోదరుడు వద్దకు వలస వెళ్లాలని తొలుత ఆ కుటుంబం భావించింది. ఇందుకోసం అక్కడి ఏజెంట్ సాయం కోసం యత్నించింది. ఓ ఏజెంట్ ద్వారా గతనెల 29న విమానంలో అహ్మదాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్లారు. అక్కడి నుంచి ఈ కుటుంబాన్ని లిబియాలోని బెంఘాజీ నగరానికి తీసుకెళ్లారు. అక్కడే వారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భారతీయ ఏజెంట్ల ప్రమేయం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ