
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)
ప్రజా ఫిర్యాదులకు సంబంధించి 2026 జనవరి నుంచి జిల్లాల్లో ఏప్ సీఎం చంద్రబాబు నాయుడు ఆకస్మిక పర్యటనలు చెయ్యనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పైన జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేస్తానని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం ప్రకటించారు. ఇప్పటికే ఈ ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో జనవరి 15ను డెడ్ లైన్‌గా ప్రకటించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు జిల్లాల ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలెర్ట్ అవుతోంది. ఈ ఫైల్ క్లియరెన్స్‌పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టనున్నారు. జిల్లా యంత్రాంగం తమ టార్గెట్‌లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుంది. 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆకస్మిక తనిఖీలు చర్చనీయాంశం అయ్యాయి. అప్పట్లో కొంతమంది సస్పెండ్ అయ్యారు కూడా. సీఎం చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత కూడా ఆకస్మిక తనిఖీలపై దృష్టి పెడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ