గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) , గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం


అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)

, గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రతి ఏటా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాత్రం రాజధాని అమరావతిలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాయపూడి సీఆర్డీఏ ఆఫీసు సమీపంలో 20 ఎకరాల్లో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande