వివిధ శాఖల తీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.) ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు చెందిన ప్రగతిపై ఉన్నతాధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయం,
వివిధ శాఖల తీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు


అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు చెందిన ప్రగతిపై ఉన్నతాధికారులు ప్రజంటేషన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయం, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లలో సాధించిన త్రైమాసిక ఫలితాలపై పరీక్షలు రాసిన విద్యార్ధిలా ఎదురు చూస్తానని.. దీనికి అనుగుణంగానే అధికారులు పని చేయాలని, లక్ష్యాలను చేరుకోవాలని సూచనలు చేశారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగామన్నారు. ఈసారి వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతంగా పెట్టుకున్నామని.. మొత్తం 17 వర్టికల్స్‌లో ఫలితాలు సాధిస్తేనే జీఎస్డీపీ పెరుగుతుందని చెప్పారు. లైవ్ స్టాక్, మాన్యుఫాక్చరింగ్, ఫిషింగ్ సహా వేర్వేరు రంగాల్లో ఈ ప్రగతిని సాధించాలని కలెక్టర్లకు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande