
జగిత్యాల, 17 డిసెంబర్ (హి.స.)
జగిత్యాల జిల్లా ఎండపల్లి గ్రామ
పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్రామంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు వచ్చిన సిబ్బందికి సరిగా భోజనం పెట్టలేదని ఫిర్యాదు మేరకు కలెక్టర్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మధ్యాహ్నం పోలింగ్ సిబ్బందికి పెట్టగా మిగిలిపోయిన భోజనాన్ని రాత్రికి కూడా సిబ్బందికి పెట్టారనీ, నాణ్యత లేని భోజనం తోపాటు మహిళా సిబ్బంది ఉండటానికి సరైన వసతులు కల్పించలేదని పోలింగ్ సిబ్బంది తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..