
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.)
కాణిపాకం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో సేవలు సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలు ప్రారంభించింది. దీనిలో భాగంగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సేవ, ఆర్జిత సేవ, దర్శనం, వసతి, ప్రసాదం టికెట్లు ఎక్కడి నుంచైనా పొందే సౌలభ్యం తీసుకొచ్చారు. నూతన వెబ్‌సైట్, వాట్సప్‌ను రూపొందించారు. వీటి ద్వారా ఆరచేతిలో టికెట్లు పొందే అవకాశం కల్పించారు.
ఈ ఆలయానికి నిత్యం దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. చాలా మంది ఆర్జిత, ఇతర సేవల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో నేరుగా వచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ