ఉలిక్కిపడ్డ భాగ్యనగరం.. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి కోర్టు సముదాయానికి బాంబు బెదిరింపు (Bomb threat) రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపు సమాచారంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు ఒక
బాంబు బెదిరింపు


హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్లోని అత్యంత రద్దీగా

ఉండే నాంపల్లి కోర్టు సముదాయానికి బాంబు బెదిరింపు (Bomb threat) రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపు సమాచారంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ఉన్న సిబ్బందిని, న్యాయవాదులను బయటకు పంపారు. అనంతరం వెంటనే భద్రతను కట్టుదిట్టం చేసి, ముందస్తు జాగ్రత్తగా కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్క్వాడ్తో కలిసి కోర్టులోని ప్రతి గదిని, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను అణువణువూ తనిఖీ నిర్వహించారు. ఎవరూ లోపలికి రాకుండా ప్రవేశ ద్వారాల వద్ద ఆంక్షలు విధించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande