BJP ఆఫీసుల ముట్టడికి AICC పిలుపు.. గాంధీభవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) నేషనల్ హెరాల్డ్ కేసు లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని
BJP ఆఫీసుల ముట్టడి


హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)

నేషనల్ హెరాల్డ్ కేసు లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా మరోవైపు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను సమీక్షిస్తున్నారు.

అయితే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో ఈడీ ని దుర్వినియోగం చేసి తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ మేరకు దేశంలో అన్ని బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలని ఏఐసీసీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల ఎదట భారీగా పోలీసులు బలగాలు, బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande