భారత జలాల్లోకి చొరబడిన బంగ్లాదేశ్ పడవలు.. 35 మందిని అదుపులోకి తీసుకున్న కోస్ట్ గార్డ్
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) బంగాళాఖాతంలో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న రెండు బంగ్లాదేశ్ ఫిషింగ్ పడవలను (BFB) భారత కోస్ట్ గార్డ్ (ICG) నౌక ''అన్మోల్'' పట్టుకుంది. డిసెంబర్ 16న ఉత్తర బంగాళాఖాతంలో సాధారణ పర్యవేక్షణ నిర్వహిస్తుండగా, భారత ఎక్స్
కోస్ట్ గార్డ్


హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)

బంగాళాఖాతంలో అక్రమంగా చేపల

వేట సాగిస్తున్న రెండు బంగ్లాదేశ్ ఫిషింగ్ పడవలను (BFB) భారత కోస్ట్ గార్డ్ (ICG) నౌక 'అన్మోల్' పట్టుకుంది. డిసెంబర్ 16న ఉత్తర బంగాళాఖాతంలో సాధారణ పర్యవేక్షణ నిర్వహిస్తుండగా, భారత ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ (EEZ) లోపల ఈ పడవలు వేటాడుతున్నట్లు గుర్తించారు. పడవలలోని 35 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, సుమారు 500 కిలోల చేపలు, వేట కోసం ఉపయోగిస్తున్న పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ సముద్ర మండలాల నియంత్రణ చట్టం (MZI Act, 1981) ఉల్లంఘించినందుకు గానూ ఈ అరెస్టులు జరిగాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande