గవర్నర్‌ రవి సంచలన కామెంట్స్.. రాష్ట్రం ఆత్మహత్యలకు రాజధానిగా మారుతోంది.
చెన్నై20డిసెంబర్ (హి.స.) : రాష్ట్రం ఆత్మహత్యలకు రాజధానిగా మారుతోందని, జాతీయ నేరగణాంకాలను బట్టి ప్రతియేటా ఈ రాష్ట్రంలో 20 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో జాతి,, మత వ
గవర్నర్‌ రవి సంచలన కామెంట్స్.. రాష్ట్రం ఆత్మహత్యలకు రాజధానిగా మారుతోంది.


చెన్నై20డిసెంబర్ (హి.స.) : రాష్ట్రం ఆత్మహత్యలకు రాజధానిగా మారుతోందని, జాతీయ నేరగణాంకాలను బట్టి ప్రతియేటా ఈ రాష్ట్రంలో 20 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో జాతి,, మత విధ్వేషాల కారణంగా పలు యుద్ధాలు జరుగుతున్నాయని, మానవులు మానసిక ఒత్తిడుల కారణంగా, వేర్పాటువాదంవల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నా రు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో శుక్రవారం ఉదయం ‘సింధూ సరస్వతి నాగరికత మహానాడు’ ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు 65 మంది చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.

ఆత్మహత్యలను నిరోధించడానికి మానవుల జీవితాలను మెరుగుపరచడంతోపాటు దేశ సంస్కృతీ సంప్రదయాలు, ఆచరిస్తున్న సిద్ధాంతాలు గురించి ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్యులు, ద్రావిడులని ప్రజల్లో విబేధాలను సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కావని, కారణం వారి వద్ద అసత్యాలతో ఆచరణకు సాధ్యం కాని సిద్ధాంతాలే ఉన్నాయని గవర్నర్‌ చెప్పారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande