
ఢిల్లీ20 డిసెంబర్ (హి.స.)
యిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని స్పైస్‌జెట్ విమాన ప్రయాణికుడు అంకిత్ దివాన్ ఆరోపించారు ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థ స్పందించింది. పైలట్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. దిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో ఈ ఘటన జరిగింది.
అంకిత్ పోస్టు ప్రకారం.. ‘నాలుగు నెలల కుమార్తెతో సహా కుటుంబంతో కలిసి స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ప్రయాణించేందుకు దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చాం. సిబ్బంది ఉపయోగించే సెక్యూరిటీ చెక్-ఇన్ లైన్‌లో వెళ్లాలని నాకు అక్కడున్నవారు సూచించారు. ఈ క్రమంలో తాము ఉన్న క్యూలోకి కొందరు మధ్యలో దూరిపోవడంతో.. వారిని ప్రశ్నించాను. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ వీరేందర్ కూడా అలాగే చేయడంతో.. అతడిని కూడా ప్రశ్నించా. ఈ క్రమంలో అతడు నాపై దుర్భాషలాడాడు. అనంతరం మా మధ్య వాగ్వాదం జరిగింది. సంయమనం కోల్పోయిన పైలట్ నాపై భౌతిక దాడికి పాల్పడ్డాడు’ అని ఆరోపించారు. ఈ పోస్టుకు తన ముఖంపై రక్తపు మరకలతో ఉన్న ఫోటోను కూడా అంకిత్ పంచుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ