
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్(SIR) ప్రక్రియపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో ఎస్ఐఆర్ అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీఎల్వోలతో (BLOs) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అమలవుతోందని తెలంగాణలోనూ ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కెనడా కంటే తెలంగాణ పెద్దది అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..