ఉత్తర భారత్‌ను కమ్మేసిన పొగమంచు
దిల్లీలో 129 విమానాలు రద్దు
ఉత్తర భారత్‌ను కమ్మేసిన పొగమంచు


దిల్లీ, 21 డిసెంబర్ (హి.స.)

: దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు అలముకోవడంతో సాధారణ జనజీవితానికి ఆటంకం ఏర్పడుతోంది. పొగమంచు తీవ్రత దృష్ట్యా శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దేశరాజధాని దిల్లీలో వాయు కాలుష్యం కూడా జతకలవడంతో నానాటికీ పరిస్థితి దిగజారుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా దృగ్గోచరత బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే 129 విమానాలు రద్దు అయ్యాయి. పర్వతప్రాంత రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లో శీతాకాల ప్రభావం మరింత ఉద్ధృతమైంది. పలు చోట్ల భారీగా మంచు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande