టీమిండియాకు ఘోర పరాభవం
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025ను పాకిస్తాన్‌ కైవసం చేసుకుంది. దుబాయ్‌ వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 21) జరిగిన ఫైనల్లో పాక్‌ భారత్‌ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసి
టీమిండియాకు ఘోర పరాభవం


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025ను పాకిస్తాన్‌ కైవసం చేసుకుంది. దుబాయ్‌ వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 21) జరిగిన ఫైనల్లో పాక్‌ భారత్‌ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో భారత్‌ 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande