
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం
కాంగ్రెస్ నిరసన ర్యాలీలు చేపట్టింది. ఏఐసీసీ పిలుపులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి (VB-G RAM G) 'వీబీ జీ రామ్ జీ' పథకంగా పేరు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపింది. నాగర్కర్నూల్ జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన నిరసనలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల -గాంధీచౌక్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..