
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
నేటి మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి
ధ్యానం ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హ శాంతి వనంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా పేరుగాంచిన కన్హ శాంతి వనాన్ని ఉపరాష్ట్రపతి, గవర్నర్తో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు.
ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు హార్ట్ఫుల్నెస్ గురూజీ శ్రీ దాజీ వారికి ఘన స్వాగతం పలికారు. మనిషి జీవితంలో ధ్యానం వల్ల మనస్సు, శరీరం శాంతి, ధైర్యం, సంతృప్తిని పొందుతాయని వారు పేర్కొన్నారు. ఒకే చోట వేలాది మందికి ధ్యానాన్ని అందించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..