నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)చార్జ్ షీట్ దాఖలు చ
నేషనల్ హెరాల్డ్


హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే, ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్ఎ (PMLA) కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్ షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande