హర్యానాలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. 23వ జిల్లాగా 'హాన్సీ'
హర్యానా, 22 డిసెంబర్ (హి.స.) హర్యానా రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 22 నుంచి 23 కు పెంచుతూ, హాన్సీని నూతన జిల్లాగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 22, 202
హర్యానా కొత్త జిల్లా


హర్యానా, 22 డిసెంబర్ (హి.స.)

హర్యానా రాష్ట్రంలో పరిపాలన

సౌలభ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 22 నుంచి 23 కు పెంచుతూ, హాన్సీని నూతన జిల్లాగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 22, 2025) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో హిసార్ జిల్లాలో భాగంగా ఉన్న హాన్సీని, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక జిల్లాగా మారుస్తూ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande