
భీమవరం, 24 డిసెంబర్ (హి.స.)
: కరాటేలో పంచ్ విసిరితే పతకం దక్కాల్సిందే అనేలా విజయాలు సాధిస్తూ పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు భీమవరం పట్టణానికి చెందిన సయ్యద్ ఆహిల్. వయసు 12 ఏళ్లు. ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 13న ఇండోర్‌లో జరిగిన జాతీయ స్కూల్ గేమ్స్ పోటీల్లో అండర్-12 విభాగంలో పోటీ పడి కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆగస్టులో విశాఖలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో 112 మంది పోటీపడి బంగారు పతకం దక్కించుకున్నాడు. ఫిబ్రవరిలో ముంబయిలో, డిసెంబరు 2024లో డెహ్రడూన్‌లో జరిగిన పోటీల్లోనూ బంగారు పతకాలు పొంది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 18, రాష్ట్ర స్థాయిలో ఏడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. రెండు రజతం, ఐదు కాంస్య పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తండ్రి సుభాన్ క్రీడా శిక్షకుడు. తల్లి జరీనా రైఫిల్ షూటర్ కావడంతో ఆరో ఏట నుంచే ఈ కుర్రోడు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ