
అమరావతి, 24 డిసెంబర్ (హి.స.)
శ్రీహరికోట: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2 ఇది తీసుకెళ్లింది. ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ