ఇండ్ల నాగేశ్వరమ్మకు జనసేనాని ఆత్మీయ పలకరింపు
గుంటూరుి, 24 డిసెంబర్ (హి.స.)గతంలో ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గుంటూరు జిల్లాలోని, తాడేపల్లి మండలంలో ఉన్న ఇప్పటంలో (Ippatam) పర్యటించారు. జన సైనికుల జయజయధ్వానాలు, అభిమానుల నినాదాల మధ్య ఇండ్ల నాగేశ్
anasenas-warm-greetings-to-indla-nageswaramma


గుంటూరుి, 24 డిసెంబర్ (హి.స.)గతంలో ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గుంటూరు జిల్లాలోని, తాడేపల్లి మండలంలో ఉన్న ఇప్పటంలో (Ippatam) పర్యటించారు.

జన సైనికుల జయజయధ్వానాలు, అభిమానుల నినాదాల మధ్య ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి చేరుకున్నారు. జనసేనానికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వృద్ధురాలైన నాగేశ్వరమ్మను సొంత బిడ్డలాగా ఆత్మీయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. నాగేశ్వరమ్మతో పాటు ఇప్పటంవాసులకు తాను అండగా ఉన్నాననే ధైర్యం ఇచ్చారు. డిప్యూటీ సీఎం స్వయంగా తమ వద్దకే వచ్చి మాట్లాడడంతో నివాసితులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ భావాలను మాటల్లో వ్యక్తపరచలేకపోయారు.

అయితే గత వైసీపీ పాలనలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహరీలను తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో వారి ఇండ్లను కూల్చివేశారు. ఆ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. మళ్లీ వస్తానని ఇండ్ల నాగేశ్వరమ్మకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం ఇప్పటం చేరుకుని వారిని పలకరించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ.. నాన్న నువ్వు ఐదుసార్లు సీఎం కావాలి.. అది నేను చూడాలని నాగేశ్వరమ్మ కోరింది. ఆమె అభిమానంతో కోరిన కోరిక పట్ల డిప్యూటీ సీఎం చిన్న చిరు నవ్వుతో సమాధానం ఇచ్చారు. ఆమె మాటతో అక్కడున్న జనసైనికులు ఆనందానికి లోనయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande