
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
అంగన్వాడీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2026 జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించనుంది ప్రభుత్వం. ముందుగా ఈ పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ లో ఈ పథకాన్ని మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. అది విజయవంతం అయితే అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్దతిలో ఆహారాన్ని అందించనున్నారు. ఒకరోజు కిచిడీ, మరోరోజు ఉప్మా విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీ కేంద్రాల్లోని 8 లక్షల మంది చిన్నారుల ఆకలి తీర్చనుంది ప్రభుత్వం. కాగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు