తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.) తిరుమలలో సోమవారం అర్థరాత్రి తర్వాత 1.30 గంటల నుంచి వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీఐపీలు వైకుంఠద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు కల్పించనున్నారు. త
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)

తిరుమలలో సోమవారం అర్థరాత్రి తర్వాత 1.30 గంటల నుంచి వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీఐపీలు వైకుంఠద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు కల్పించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. సోమవారం రాత్రే తిరుమలకు చేరుకున్న సీఎం, కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన సీఎం, కుటుంబ సభ్యులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande