
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
2026లో కీలక మార్పులు రానున్నాయి.
జనవరి 1 నుంచి క్రెడిట్ రిపోర్ట్ మరింత వేగంగా అప్డేట్ కానుంది. ఇప్పటివరకూ 15 రోజులకు ఒకసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవుతుండగా.. ఇకపై బ్యాంకులు వారానికి ఒకసారి బ్యూరోలకు నివేదించాల్సి ఉంది.
రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు..
న్యూ ఇయర్లో రైళ్ల రాకపోకల సమయాలు కూడా మారనున్నాయి. కొత్త టైమ్ టేబుల్ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వందేభారత్ ఎక్స ప్రెస్ లతో పాటు మొత్తం 25 రైళ్ల సమయాలు మారనున్నాయి.
8th పే వేతన కమిషన్
2025 డిసెంబర్ 31తో 7వ వేతన కమిషన్ గడువు ముగియనుంది. జనవరి 1 నుంచి 8వ వేతన కమిషన్ ప్రారంభం కానుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా.. వేతన పెంపు నిర్ణయాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట లభించనుంది.
కార్ల ధరలు పెంపు.. ఎల్పీజీ ధరలు తగ్గే ఛాన్స్
జనవరి 1 నుంచి కార్లు, బైకుల ధరలు పెరగనున్నాయి. బెంజ్, బీఎండబ్ల్యూ, నిస్సాన్, రెనో, జేఎస్ డబ్ల్యూ, ఎంజీ మోటార్, బీవైడీ కంపెనీలు కారల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. బైక్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కూడా స్కూటర్లపై రూ.3 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇక ఎల్పీజీ, కమర్షియల్ గ్యాస్, ఏటీఎఫ్ ధరలను ప్రతీ నెల 1న చమురు కంపెనీలు సవరిస్తాయన్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు