శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పొగ మంచు ఎఫెక్ట్.. భారీగా విమాన సర్వీసులు రద్దు
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.) ఉత్తర భారతదేశం లో కొనసాగుతున్న దట్టమైన పొగమంచు ప్రభావం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోవడంతో ఇండిగో, ఎయిరిండియా వంటి ఎ
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు


హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)

ఉత్తర భారతదేశం లో కొనసాగుతున్న దట్టమైన పొగమంచు ప్రభావం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోవడంతో ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్లైన్స్లు వందల సంఖ్యలో తమ సర్వీసులను ఇప్పటి రద్దు చేస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, విశాఖపట్నం వంటి రూట్లలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

వాటిలో ఇక సోమవారం ఢిల్లీలో 128 విమానాలు రద్దు చేయగా.. 2008 పైగా ఆలస్యమయ్యాయి. హైదరాబాద్లో కనెక్ట్ అయిన రూట్లు కూడా ఉన్నాయి. ఇండిగో ఒక్కటే దాదాపు 80 విమానాలను రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోచి, అమృత్సర్, చండీగఢ్ వంటి నగరాలకు సంబంధించిన సర్వీసులు ఉన్నాయి. ఈ పొగమంచు ప్రభావం డిసెంబర్ 30న కూడా కొనసాగే అవకాశం ఉందని ఎయిర్లైన్స్ సంస్థలు అడ్వైజరీ విడుదల చేశాయి. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ను ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించారు. రీషెడ్యూలింగ్, రీఫండ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande