హైదరాబాద్ 11 మార్చి (హి.స.): రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల మార్కులను టీజీపీఎస్సీ మంగళవారం వెల్లడించనుంది. అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించనుంది. ఈ మేరకు ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూలు ప్రకటించింది.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల